Gorantla Madhav: పెళ్లి క్రిస్టియన్‌తో.. ఓట్లు మాత్రం హిందువులవి కావాలా పవన్?
Gorantla Madhav: పవన్ కళ్యాణ్ క్రిస్టియన్‌ను పెళ్లి చేసుకుని హిందువుల ఓట్లు వేయించుకుని ఆంధ్రప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత గోరంట్ల మాధవ్. అధికారంలోకి రాకముందు మాత్రం సుగాలి ప్రీతి కేసును గెలవగానే విచారణ చేయించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని అన్నాడని ఆ విషయాన్ని గాలికొదిలేసాడని అన్నారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని తెగ వాగారని ఇప్పుడేమో వారిలో ఒక్క అమ్మాయిని కూడా వెతికి వారి కుటుంబానికి అప్పగించలేదని ఆరోపించారు. సూపర్ సిక్స్ అమలు చేయమంటే ఆధ్యాత్మికత సనాతన ధర్మం గురించి ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకోవడాన్ని తాను తప్పు పట్టడం లేదని.. కానీ సనాతన ధర్మం అంటూ వేరే రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మాధవ్ మండిపడ్డారు.