Gorantla Madhav: చంద్రబాబు లోఫర్ పవన్ జోకర్
Gorantla Madhav: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడుని పట్టుకుని లోఫర్ అని సంబోధించాడు వైఎస్సార్ కాంగ్రెస్ నేత గోరంట్ల మాధవ్. చంద్రబాబు ఓ లోఫర్.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ జోకర్ అంటూ రెచ్చిపోయారు.
“” చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ మాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఈరోజు ప్రజల భావన సూపర్ సిక్స్ కాదు.. చంద్రబాబు నాయుడు లోఫర్ సిక్స్.. పవన్ జోకర్ సిక్స్ అనే అభిప్రాయానికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో మూడు సూపర్ సిక్స్‌లు అమల్లో ఉన్నాయి. ఒకటి కర్నూలు జిల్లాలో హత్యాచారం.. రెండోది పుంగనూరులో ఓ అమ్మాయిపై హత్యాచారం.. మూడోది అత్తాకోడళ్లపై అత్యాచారం.. నాలుగోది ఆస్పరిలో ఓ అమ్మాయిపై హత్యాచారం.. ఐదోది కడపలో ఆడపిల్లపై పెట్రోల్ పోసి హత్య.. సిక్స్ మదనపల్లిలో ఎస్సై తల్లి దారుణ హత్య.. ఈ సూపర్ సిక్స్‌లు చంద్రబాబు అమలు చేస్తున్నారు “” అన్నారు.