Ghulam Nabi Azad: ఎక్కువగా హిందువులే ముస్లింలుగా మారారు
DPAP చైర్మన్ గులామ్ నబీ ఆజాద్ (ghulam nabi azad) వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇండియాలోని చాలా మంది ముస్లింలు ఒకప్పుడు హిందువులేనని వారు కన్వర్ట్ అయ్యారని అన్నారు. కశ్మీర్ వ్యాలీలోని చాలా మటుకు కశ్మీరీ పండిట్‌లు ముస్లింలుగా కన్వర్ట్ అయ్యారని తెలిపారు. పొలిటికల్ మైలేజీ కోసం మతాన్ని వాడుకోకూడదని, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసేవారు బలహీనులని అన్నారు. దోడా జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో ఆజాద్ మాట్లాడారు.
“” మొన్న ఓ BJP నేత అన్నారు.. దేశంలో ఉన్న ముస్లింలలో సగం మంది బయట నుంచి వచ్చినవారే అని. ఇక్కడ లోపల బయట అనేది ఏమీ లేదు. ప్రపంచంలో ఇస్లాం 1500 ఏళ్ల క్రితం నుంచి ఉంది. హిందు మతం కూడా చాలా పురాతనమైనది. బహుశా 10 నుంచి 20 మంది ముస్లింలు మాత్రమే బయటి నుంచి వచ్చి ఉంటారు. వాళ్లు కూడా మొఘల్ ఆర్మీకి చెందినవారు అయ్యివుంటారు. ఇక మిగతా ముస్లింలంతా హిందూ మతం నుంచి కన్వర్ట్ అయినవారే. దీనికి కశ్మీరే ఉదాహరణ. 600 ఏళ్ల క్రితం కశ్మీర్‌లో ముస్లింలు ఎవరు? వారంతా కశ్మీరీ పండిట్లు. వాళ్లు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. అందరూ ఈ మతంలోనే జన్మించారు. హిందువులు చనిపోతే వేరే ప్రదేశాల్లోకి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. ఆ తర్వాత వారి అస్తికలను నదిలో వదిలేస్తారు. మనం అదే నీరు తాగుతుంటాం. కానీ నీళ్లు తాగేవారికి ఎలా తెలుస్తుంది అందులో అసక్తికలు కలిసాయని? అదే విధంగా ముస్లింల అస్తికలు కూడా ఈ దేశ మట్టిలో కలిసిపోయాయి. వారు కూడా ఈ నేలకు చెందినారే. ఈ నెలలోనే ముస్లింలు, హిందువులు కలిసిపోయి ఉన్నారు. వారిలో ఏ విభేదాలున్నాయి? మతాల పేరుతో రాజకీయం చేసేవారు బలహీనులు. ఓట్ల కోసం ఫలానా ముస్లిం పేరు ఫలానా హిందూ పేరు ఎందుకు తెస్తారు? “” అని వెల్లడించారు ఆజాద్. (ghulam nabi azad)