Gautami Tadimalla: నన్ను మోసం చేసిన వ్యక్తికి BJP సపోర్ట్ చేస్తోంది
ప్రముఖ నటి గౌతమి (gautami tadimalla) BJP పార్టీకి రాజీనామా చేసారు. దాదాపు 25 ఏళ్లుగా ఆ పార్టీలో పనిచేసిన గౌతమి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో బాధపడుతున్నట్లు తెలిపారు. తన ప్రాపర్టీలపై కన్నేసిన ఓ వ్యక్తికి అదే పార్టీ సాయం చేస్తోందని ఆరోపించారు గౌతమి. అళగప్పన్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా తన ఆస్తులను చూసుకుంటూ వచ్చారని కానీ ఆయన తన ఆస్తులపై కన్నేసి మోసం చేసినట్లు ఇటీవల తెలిసిందని తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. BJP తనకు సపోర్ట్ చేయకపోగా అళగప్పన్కు సాయం చేస్తున్నారని తెలిసి షాకయ్యానని ఇలాంటి చోట తాను ఉండలేనని గౌతమి ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (mk stalin) తనకు మద్దతుగా నిలిచి న్యాయం జరిగేలా చూస్తారని ఆశిస్తున్నట్లు ఓ లెటర్ రిలీజ్ చేసారు.