Gangula Kamalakar: వారు AP TSని విలీనం చేయాలని చూస్తున్నారు
కాంగ్రెస్, BJP పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను విలీనం చేయాలని ప్లాన్ వేస్తున్నాయని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు BRS నేత గంగుల కమలాకర్ (gangula kamalakar). కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. BJP తెలంగాణలో అధికారంలోకి వస్తే రెండు రాష్ట్రాలను మళ్లీ ఏకం చేసే ప్లాన్‌లో ఉందని ఆరోపించారు. అందుకే ఈసారి కూడా BRSకే ఓటు వేసి KCRని మూడోసారి సీఎంను చేయాలని విన్నవించారు.