Gaddar Daughter: కాంగ్రెస్ టికెట్ ఇస్తాం అన్నారు.. మ‌ళ్లీ స‌ప్పుడు లేదు

Telangana Elections: కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టిక్కెట్ ఇస్తామన్నారు కానీ త‌ర్వాత స‌ప్పుడు చేయ‌లేద‌ని అన్నారు ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ కుమార్తె వెన్నెల‌ (gaddar daughter). ఇప్పుడు తెలంగాణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి కాబ‌ట్టి త‌న‌కు కాంగ్రెస్ పార్టీని టిక్కెట్ ఇవ్వాలని.. తాను క‌చ్చితంగా గెలుస్తాన‌ని అంటున్నారు. తాను కంటోన్మెంట్లో పుట్టి పెరిగాన‌ని పోటీలో ఉంటారా అని చాలా మంది అడుగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తాన‌ని వెన్నెల స్ప‌ష్టం చేసారు. గ‌ద్ద‌ర్ చ‌నిపోయిన‌ప్పుడు రాహుల్ గాంధీ (rahul gandhi) వెన్నెల‌ను క‌లిసి టికెట్ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. కానీ మొన్న రిలీజ్ చేసిన తొలి అభ్య‌ర్ధుల జాబితాలో వెన్నెల పేరు లేదు. (vennela)