కాంగ్రెస్‌లోకి గడల శ్రీనివాస్!
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మాజీ డైరెక్టర్, డాక్టర్ గడల శ్రీనివాస రావు (gadala srinivas) కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఆయన సిద్ధమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్ నుంచి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కొత్తగూడెం టికెట్ ఆశించిన ఈయన.. టికెట్ హామీ ఇచ్చి, చివరి నిమిషంలో వనమాకు ఇచ్చిన కేసీఆర్‌పై మనస్తాపానికి గురైన గడల ప్రస్తుతం లాంగ్ లీవ్‌లో ఉన్నారు. ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలలో ఏదో ఒక టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారు. ఆయన తరఫున ఈ రెండు సీట్లకు శుక్రవారం గాంధీ భవన్‌లో దరఖాస్తు చేశారు.