G20 Summit కీల‌క అంశాలు..!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో నేడు జీ20 స‌మ్మిట్ (g20 summit) తొలి స‌మావేశం అట్ట‌హాసంగా జ‌రిగింది. దాదాపు 30 దేశాల‌కు చెందిన డెలిగేట్లు స‌మావేశంలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము (president dinner) అధికారిక నివాసంలో డిన్న‌ర్ నిర్వ‌హించారు. ఈరోజు జ‌రిగిన స‌మ్మిట్‌లో జ‌రిగిన కీల‌క అంశాలేంటో ఒక‌సారి చూద్దాం.

*జీ20 స‌మ్మిట్‌లో భాగంగా ఆఫ్రిక‌న్ దేశానికి (africa) ఈ స‌మ్మిట్‌లో ప‌ర్మ‌నెంట్ స‌భ్య‌త్వం ఇస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) ప్ర‌క‌టించారు. అంటే.. ఇక నుంచి భార‌త్‌లో జ‌రిగే జీ20 శిఖ‌రాగ్ర స‌దస్సులో ఆఫ్రికా కూడా పాల్గొంటుంది. ఈ నిర్ణ‌యంతో ఆఫ్రికాలో జ‌రుగుతున్న అభివృద్ధి దేశాలు కూడా గ్లోబ‌ల్ డెసిష‌న్స్‌లో తీసుకోవచ్చు.

*భార‌త్, అమెరికా, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు, అరబ్ రాష్ట్రాలు, ఐరోపాల మ‌ధ్య రైళ్లు, ఓడ‌ల క‌నెక్టివిటీని ఏర్పాటుచేయాల‌న్న ప్లాన్ గురించి చ‌ర్చ‌లు స‌ఫ‌లీకృత‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ క‌నెక్టివిటీ నెట్‌వ‌ర్క్ ద్వారా ఈ దేశాల‌న్నీ క‌లిసి ట్రేడింగ్ చేసేందుకు సులువుగా ఉంటుంది. (g20 summit)

*ఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు (delhi declaration) చైనా, ర‌ష్యా దేశాలు ఒప్పుకున్నాయి. డిక్ల‌రేషన్‌లో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అన్ని దేశాలు అంత‌ర్జాతీయ నిబంధ‌న‌లు, అగ్రిమెంట్ల‌కు క‌ట్టుబ‌డి ఉండాలి. ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాల‌కు ఆర్థిక న‌ష్టాన్ని క‌లిగించిన చైనా రోడ్డు ప్రాజెక్ట్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఈ డిక్ల‌రేష‌న్‌ను తీసుకొచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభంపై భిన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో అన్ని దేశాలు క‌లిసి డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం తెల‌ప‌డం భార‌త్‌కి చారిత్రాత్మ‌క విజ‌యం అని భావిస్తున్నారు.

*జీ20 స‌మ్మిట్‌లో  (g20 summit) మోదీ గ్లోబ‌ల్ బ‌యోఫ్యుయెల్ రిల‌య‌న్స్ (global biofuel reliance) అనే కాన్సెప్ట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మొక్క‌లు, జంతువుల వేస్ట్ నుంచి ప‌రిశుభ్ర‌మైన ఇంధ‌నాలు త‌యారుచేయాల‌ని పిలుపునిచ్చారు. మెరుగైన వాతావ‌రణం, కాలుష్య స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

*అన్ని దేశాల‌కు ఒకదానిపై ఒక‌టి న‌మ్మకంతో ఉండాల‌ని పిలుపునిచ్చారు. అప్పుడే అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ఈ సంద‌ర్భంగా మోదీ తెలిపారు.