Parliament: నాకు వివాహ‌మైంది.. కోపం అస్సలు రాదు

Delhi: పార్ల‌మెంట్ స‌మావేశాల్లో (parliament) ఆస‌క్తిక‌ర చ‌ర్చ చోటుచేసుకుంది. మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌పై (manipur violence) పార్ల‌మెంట్‌లో చ‌ర్చించాల‌ని కాంగ్రెస్ పార్టీ అధికార BJPని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌శ్నిస్తూనే ఉంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ జ‌గ్‌దీప్ ధ‌న్కార్ మ‌ధ్య ఇంట్రెస్టింగ్ చ‌ర్చ జ‌రిగింది. రూల్ 267 కింద పార్ల‌మెంట్‌లో మ‌ణిపూర్ అల్ల‌ర్ల గురించి చ‌ర్చించ‌వ‌చ్చు క‌దా అని మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.. జ‌గ్‌దీప్‌ను ప్ర‌శ్నించారు.

దీనికి జ‌గ్‌దీప్ స్పందిస్తూ.. “” రూల్ 267 ఎందుకు.. రూల్ 176పై కేంద్రం ఈ అంశం గురించి చ‌ర్చించ‌డానికి సిద్ధంగానే ఉంది క‌దా “” అని అన్నారు. నిజానికి రూల్ 267 కింద ఏ అంశం గురించైనా మాట్లాడాలంటే ఇత‌ర అంశాల‌ను అస్స‌లు ప్ర‌స్తావించ‌కూడ‌దు. అదే  రూల్ 176 కింద ఏ అంశం గురించైనా మాట్లాడాలంటే చాలా త‌క్కువ స‌మ‌యం మాత్ర‌మే ఉంటుంది. దాంతో మ‌ణిపూర్ అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని మాట్లాడ‌నివ్వ‌కుండా ఆపుతున్న‌ది జ‌గ్‌దీపేన‌ని ఆరోపించారు ఖ‌ర్గే.

“” రూల్ 267 కింద చ‌ర్చ జ‌రిపితే మ‌ణిపూర్ అంశానికే ఎక్కువ ప్రాముఖ్య‌త ఇస్తారు. నేను అడిగిన దాంట్లో త‌ప్పేముంది? ఎందుకు రూల్ 267 కింద చ‌ర్చ జ‌ర‌ప‌మంటే కేంద్రానికి అహం అడ్డు వ‌స్తోంది? నేను ఇదే ప్ర‌శ్న మిమ్మ‌ల్ని అడిగితే నిన్న మీరు ఎందుకో కోపంలో ఉన్న‌ట్లున్నారు “” అని ఖ‌ర్గే జ‌గ్‌దీప్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. దీనికి జ‌గ్‌దీప్ స్పందిస్తూ..“” నాకు వివాహం అయ్యి 45 ఏళ్లు అవుతోంది. నాకు కోపం అస్స‌లు రాదు “” అని ఫ‌న్నీగా స‌మాధానం ఇచ్చారు. దీనికి ఖ‌ర్గే స్పందిస్తూ.. మీరు బ‌హుశా బ‌య‌టికి చూపించ‌ట్లేదేమో కానీ లోలోప‌ల చాలా కోపంగా ఉన్నారు అన్నారు. దాంతో పార్లమెంట్‌లో న‌వ్వులు పూసాయి. (parliament)