Telangana Elections: బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు..!
Telangana Elections: నక్సలైట్లు, మావోయిస్టులు ప్రజల కోసం పనిచేసే యోధులుగా భావిస్తుంటారు. వారు ఎంచుకున్న మార్గం తప్పే అయినా చేసేది మాత్రం ప్రజల మంచికే అని నమ్మేవారూ ఉన్నారు. కానీ నక్సలిజం, మావోయిజం అనేవి ఎప్పటికైనా సమాజానికి హానికరమే. అందుకే రాష్ట్రంలో ఉన్న నక్సలైట్లు, మావోయిస్టులపై కనిపించగానే కాల్పులు జరిపేయకుండా మారేందుకు ఒక అవకాశం ఇస్తుంటారు. తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఒకప్పుడు నక్సలైట్లు, మావోలుగా ఉన్నవారు ఇప్పుడు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన నేతలుగా మారిన వారు ఎవరో ఓ లుక్కేద్దాం.
దనసారి అనసూయ అలియాస్ సీతక్క
ములుగు (mulugu) ఎమ్మెల్యే సీతక్క (seethakka) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో కాలంగా కాంగ్రెస్‌కు నమ్మిన బంటుగా ప్రజల కోసమే అన్నట్లు ఆమె తన జీవితాన్ని అంకితం చేసారు. అసలు ఆమె అవతారం చూస్తే ఎవ్వరికీ కూడా రాజకీయ నాయకురాలిగా కనిపించరు. పక్కింట్లో ఉంటూ చక్కగా పలకరించే ఓ పెద్దావిడగా కనిపిస్తారు. సీతక్క అంటే ములుగు ప్రజలకు ఎనలేని అభిమానం. (telangana elections)
ఎందుకంటే ఆమె ములుగు ప్రజల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు సీతక్క నక్సలైట్‌గా వ్యవహరించేవారు. 2000 సంవత్సరంలో తెలంగాణలో నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో సీతక్క చంద్ర పుల్లారెడ్డికి చెందిన CPI (ML) దళానికి కమాండర్‌గా ఉన్నారు. ఆ తర్వాత తనని తాను సరెండర్ చేసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో 2009 ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు సీతక్క. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగి TDP పతనమైపోయిందో ఆమె కాంగ్రెస్‌లో చేరారు.
అలా 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ సీట్లలోని 11 సీట్లను నాటి TRS సొంతం చేసుకోగా ములుగు మాత్రం టచ్ చేయలేకపోయారు. 2018 ఎన్నికలయ్యాక దాదాపు 18 మంది కాంగ్రెస్ అభ్యర్ధులు ఒకేసారి BRS పార్టీలో చేరారు. ఆరుగురు మాత్రం కాంగ్రెస్‌నే నమ్ముకున్నారు. వారిలో సీతక్క ఒకరు. (telangana elections)
బాడె నాగజ్యోతి
ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్లు ఈసారి సీఎం KCR.. పార్టీ నుంచి ములుగులో మావోయిస్ట్ కుటుంబానికి చెందిన బాడె నాగజ్యోతిని (bade nagajyoti) బరిలోకి దింపారు. నాగజ్యోతి తండ్రి బాడె ప్రభాకర్ CPIకి చెందిన ఏటూరి నగరం దళంలో మావోయిస్ట్‌గా ఉండేవారు. నాగజ్యోతికి ఐదేళ్లు ఉన్నప్పుడు పోలీసుల కాల్పుల్లో ప్రభాకర్ చనిపోయారు. నాగజ్యోతి తల్లి రాజేశ్వరి అలియాస్ నిర్మలక్క కూడా మావోయిస్ట్ పార్టీలో దళం సభ్యురాలిగా ఉన్నారు.
ఈటెల రాజేందర్
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా BRS పార్టీ నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ కూడా ఒకప్పుడు నక్సల్ దళానికి చెందినవారే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు వరకు నక్సల్‌గానే వ్యవహరించిన ఈటెల.. ఆ తర్వాత అప్పటి TRS పార్టీలో చేరారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల BRS పార్టీకి రాజీనామా చేసి BJPలో చేరారు.
మావోలు, నక్సల్స్‌గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చినవారు..
గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
రసమయి బాలకిషన్
నరదాసు లక్ష్మణ్ రావు
గద్దర్ (గద్దర్ కూతురు వెన్నెల కాంగ్రెస్ టికెట్ కోసం ఆశిస్తున్నారు)