Malla Reddy: రేవంత్ న‌న్ను అక్క‌డి నుంచే పోటీ చేయ‌మ‌న్నాడు

Malla Reddy: BRS నేత మ‌ల్లారెడ్డి బాంబు పేల్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (revanth reddy) త్వ‌ర‌లో క‌ల‌వ‌నున్న‌ట్లు మ‌ల్లారెడ్డి షాకింగ్ కామెంట్ చేసారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో BRS పార్టీ ఓడిపోయింద‌నే షాక్ నుంచి ఇంకా తేరుకోలేద‌ని అన్నారు. తాము ఓడిపోతామ‌ని.. కాంగ్రెస్ గెలుస్తుంద‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా త‌న‌నే పోటీ చేయ‌మ‌న్నార‌ని మ‌ల్లారెడ్డి తెలిపారు. గ‌తంలో తాను, రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో (TDP) క‌లిసే ఉన్నామ‌ని అభివృద్ధి కోసం ముఖ్య‌మంత్రిని క‌లిస్తే త‌ప్పేంట‌ని అన్నారు. త‌న కుమారుడు భ‌ద్రారెడ్డికి టికెట్ ఇవ్వాల‌ని అడిగిన‌ట్లు తెలిపారు.