Jagan: అలిగిన బాలినేని.. సర్దిచెప్పిన జగన్!
Markapur: మాజీ మంత్రి, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాస్ లీడర్ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni Srinivas Reddy)కి ఇవాళ మార్కాపురం(Markapur)లో చేదు అనుభవం ఎదురైంది. ప్రకాశం జిల్లా(prakasam district) మార్కాపురంలో సీఎం జగన్(cm jagan) ఆధ్వర్యంలో ఈబేసీ నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాకుండానే మాజీ మంత్రి బాలినేని వెనుదిరిగారు. అయితే.. దీనికి కారణం కూడా లేకపోలేదు. సీఎం వచ్చే ముందు… హెలిప్యాడ్(helipad) వద్దకు బాలినేని వెళ్తుండగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. కనీసం ప్రొటోకాల్(protocol) కూడా ఇవ్వలేదు.
దీంతో బాలినేని కోపంతో అలిగి అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. ఈక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్(minister adhimulapu suresh).. బాలినేని బుజ్జగించడానికి ప్రయత్నించారు. కానీ ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారు. వాస్తవానికి సీఎం వస్తుంటే జిల్లా నాయకులు, అధికారులు వెళ్లి రిసీవ్ చేసుకోవడం ఆనవాయితీ. అదేవిధంగా బాలినేని సైతం సీఎం హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లేందుకు వాహనంలో వచ్చారు. అయితే ఆయన్న వాహనం దిగి నడిచివెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ విషయం నచ్చకపోవడంతో బాలినేని అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇక సీఎం ఈ కార్యక్రమానికి వచ్చిన సమయంలో బాలినేని కనిపించకపోవడంతో ఆరా తీసినట్లు సమాచారం. సీఎం జగన్ జోక్యంతోనే బాలినేని మళ్లీ అలకవీడి కార్యక్రమానికి హాజరయ్యరని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.