Shettar: బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లి.. ఓడిన మాజీ సీఎం!

Bengaluru: క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల‌కు(karnataka elections) ముందు BJP నుంచి కాంగ్రెస్‌కు జంప్ అయిన ఆ రాష్ట్ర మాజీ సీఎం జ‌గ‌దీష్ షెట్టార్‌కు(jagadish shettar) షాక్ త‌గిలింది. త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన హుబ్లి- ధ‌ర్వాడ్ సెగ్మెంట్‌లో ఆయ‌న 35వేల ఓట్ల‌తో వెనుకంజ‌లో ఉన్నారు. అదే ప్రాంతంలో బీజేపీ అభ్య‌ర్ధి మ‌హేష్ తెంగ‌నకాయ్ షెట్ట‌ర్‌పై పోటీ చేసి గెలుపు వైపు దూసుకెళ్తున్నారు. బీజేపీ షెట్టార్‌ను హుబ్లి- ధార్వాడ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయ‌నివ్వ‌లేద‌ని ఆయ‌న కోపంతో కాంగ్రెస్‌లో చేరారు. అప్ప‌టికీ మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని బీజేపీ న‌చ్చ‌జెప్పిన‌ప్ప‌టికీ ఆయ‌న విన‌లేదు. ఇప్పుడు పార్టీ మారి మ‌రీ ఓటమిపాల‌వుతున్నందుకు ఆయ‌న చింతిస్తున్న‌ట్లు తెలుస్తోంది.