Telangana Elections: తొలి పోటీ.. తొలి గెలుపు..!
Telangana Elections: హైదరాబాద్‌లోని బహదూర్‌పురా (bahadurpura) అసెంబ్లీ సీటులో తొలిసారి నలుగురు నేతలు బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్‌లోనే అతిపెద్ద అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన బహదూర్‌పురాలో మూడు లక్షల ఓటర్లు, 263 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఈ బహదూర్‌పురాలో AIMIM నుంచి మహమ్మద్ ముబీన్, BRS నుంచి మీర్ ఇనాయత్ అలీ బక్రీ, కాంగ్రెస్ నుంచి రాజేష్ కుమార్ పులిపాటి, BJP నుంచి నరేష్ పోటీ చేస్తున్నారు. ఈ నలుగురూ గతంలో ఎప్పుడూ కూడా బహదూర్‌పురా నుంచి బరిలోకి దిగింది లేదు. దాంతో ఇక్కడ గెలిస్తే ఈ నలుగురికీ ఇదే తొలి గెలుపు అవుతుంది.
2002లో డీలిమిటేషన్ చట్టం ప్రకారం 2009లో ఈ బహదూర్‌పురా నియోజకవర్గాన్ని ఏర్పాటుచేసారు. ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనని ముబీన్ చాలా ధీమాగా ఉన్నారు. గెలిచిన వెంటనే స్థానిక కామటిపురాలో ఒక హాస్పిటల్ ఆ తర్వాత బహదూర్‌పురాకి ఓ కేబుల్ బ్రిడ్జ్ తీసుకురావాలన్న ఆలోచన ఉందని తెలిపారు.