Telangana: ప్రభుత్వానికి తొలి షాక్.. ఆ కంపెనీ వెనక్కి వెళ్లిపోయింది
Telangana: తెలంగాణ ప్రభుత్వానికి ఐటీ రంగంలో తొలి షాక్ తగిలింది. KTR ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్నింగ్ (corning) అనే యాపిల్ సప్లయర్ తెలంగాణలో వెయ్యి ఎకరాల్లో తయారీ సంస్థను ఏర్పాటుచేయాలనుకుంది. ఆ సమయంలో KTR సమక్షంలో సంస్థ ఏర్పాటుకు అన్ని సన్నాహాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఆ సంస్థ తెలంగాణలో కాకుండా తమిళనాడులో పరిశ్రమ ఏర్పాటుచేయాలని భావిస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం కార్నింగ్ సంస్థతో సంప్రదింపులు జరిపి తెలంగాణ కంటే తమిళనాడులో పెడితే మరింత బాగుంటుందని చెప్పిందట. దాంతో ఇప్పుడు ఆ సంస్థ తెలంగాణను వీడనుంది. ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (sridhar babu) ఈ సంస్థ చేజారకుండా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. ఎందుకంటే ఈ పరిశ్రమ తెలంగాణలో వస్తే దాదాపు 800 మంది ఉద్యోగాలు దొరుకుతాయి. సంస్థలను తీసుకురావడమే కాదు ఆ సంస్థలను చేజార్చుకోకుండా చూసుకోవడం కూడా ఐటీ శాఖ బాధ్యతే కదా..!