Canada Issue: అమెరికా ఇండియా వైపే నిలబడుతుంది
కెనడా (Canada) భారత్ (bharat) మధ్య రగులుతున్న ఖలిస్తానీ సమస్య వల్ల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి (canada issue). అయితే ఈ విషయంలో రెండు దేశాలకు కామన్ దోస్త్ అయిన అమెరికా (america) మాత్రం ఎటువంటి పక్షపాతం చూపడం లేదు. అమెరికా ఎవ్వరి పక్షాన నిలవదని.. ఆరోపణలు వస్తే ఏ దేశం అయినా తప్పు లేదని నిరూపించుకోవాల్సిందేనని అగ్రరాజ్యం ఇప్పటికే స్పష్టం చేసింది.
అయితే అమెరికాకు చెందిన డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ పెంటగాన్ మాజీ అధికారి రుబిన్ వివరణ మాత్రం వేరేలా ఉంది. ఒకవేళ అమెరికాకు ఇండియా కెనడా మధ్య ఒక దేశాన్ని ఎంచుకోవాల్సి వస్తే తప్పకుండా ఇండియానే ఎంచుకుంటుందని ఎందుకంటే అమెరికాకు కెనడా కంటే ఇండియానే ముఖ్యమని తెలిపారు. కెనడా ఇండియాతో గొడవపెట్టుకుంటోంది అంటే చీమ ఏనుగుతో గొడవపెట్టుకున్నట్లేనని రుబిన్ అభిప్రాయపడ్డారు. కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నంత వరకు అమెరికాతో దౌత్య సంబంధాలు బాగోవని.. ట్రూడో తప్పుకుంటే మళ్లీ ఆ దేశంలో సత్సంబంధాలు మెరుగుపడతాయని తెలిపారు. (canada issue)