EXCLUSIVE: ముందస్తు సర్వే ఏం చెప్తోంది.. ఆ ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారా?
EXCLUSIVE: తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసాక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇవ్వడం వల్లే తాను ఓడిపోయానని.. నువ్వు ఆ తప్పు చేయకు అని కొన్ని రోజుల క్రితం తెలంగాణ మాజీ సీఎం KCR.. జగన్కు ఫోన్ చేసి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో జగన్ దాదాపు 175 సీట్లలో దాదాపు సగానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని అనుకోవడంలేదట. దాంతో దాదాపు 70 మంది YSRCP నేతల్లో గుబులు రేకెత్తినట్లు తెలుస్తోంది.
ముందస్తు సర్వే ఏం చెప్తోంది
ఈ నేపథ్యంలో ఓ ముందస్తు సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2024లో జరగబోయే ఏపీ ఎన్నికల్లో TDP-జనసేనకు 144 సీట్లు.. YSRCPకి 31 సీట్లు మాత్రమే వస్తాయని ఆ సర్వే చెప్తోంది. దాంతో YSRCP కి చెందిన దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారట.
గ్రాఫ్ పెంచుకోండి
ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు జగన్.. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టి గ్రాఫ్ పడిపోయిన ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్లు ఇవ్వను అని చెప్పేసారట. మళ్లీ టికెట్ కావాలంటే మాత్రం ప్రజల్లోకి వెళ్లి వారిని మంచి చేసుకుని మళ్లీ గ్రాఫ్ పెంచుకోగలిగితేనే టికెట్లు ఇస్తామని చెప్పారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి మళ్లీ ఓడిపోవడం కంటే వారికి టికెట్లు ఇవ్వకుండా మళ్లీ అధికారంలోకి వచ్చి టికెట్లు రాని వారికి మంచి పదవులు ఇస్తే మంచిది అని జగన్ అనుకుంటున్నారు.
అందుకే బాలినేని అలా అన్నారా?
ఇటీవల YSRCP ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) ఒక మాటన్నారు. తమకు జగన్ అంటే పిచ్చి ప్రేమ ఉన్నప్పటికీ జగన్కు తమపై ఆ ప్రేమ అభిమానం లేవని.. ఆయనకూ తమపై ఆ అభిమానం ఉంటేనే కదా అని తన మనసులో మాటను బయటపెట్టారు. ఈ సర్వే ఫలితాలను చూసే బాలినేని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. లేదా.. తనకు సీటు ఎక్కడ ఇవ్వరో అని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.