Narayana: ఇన్న‌ర్ రింగ్ రోడ్డులో నా భూమి పోయింది..!

మాజీ మంత్రి నారాయ‌ణ (narayana) ఈరోజు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న చంద్ర‌బాబు నాయుడుతో (chandrababu naidu) ములాఖాత్ అయ్యారు. అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగు రోడ్డు స్కాంలో మీరూ ఉన్నారా అని అడిగిన ప్ర‌శ్న‌కు నారాయణ స్పందించారు. ఇన్న‌ర్ రింగు రోడ్డులో (amaravathi inner ring road) 2001లో తాను కొన్న కొంత భూమే పోయింద‌ని.. దాని విలువ రూ.7 కోట్లు ఉంటుంద‌ని అన్నారు. ఈ విష‌యం త‌న‌కు ఇప్పుడే తెలిసింద‌ని.. త‌న భూమే పోతే ఇక తాను స్కాం చేసిన‌ట్లు ఎలా అవుతుందని ప్ర‌శ్నించారు. కోర్టులే త‌మ‌కు న్యాయం జ‌రిగేలా చూస్తాయ‌ని 2024లో YSRCPకి ప్ర‌జ‌లే బుద్ధిచెప్తార‌ని అన్నారు.