Siddaramaiah: నా శవం కూడా BJP దగ్గరికి వెళ్లదు
తన శవం కూడా BJP దగ్గరికి వెళ్లదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య (siddaramaiah). గతంలో BJP నేతలను కలిసి ఉండవచ్చు కానీ దాని అర్థం వారికి సపోర్ట్ చేస్తున్నట్లు కాదని తెలిపారు. తన జీవితం మొత్తం మతవిద్వేషాలకు అతీతంగా పోరాడుతూనే వచ్చానని అన్నారు. ఇటీవల JD(S) నేత కుమారస్వామి.. సిద్ధరామయ్య గురించి మాట్లాడుతూ గతంలో ఆయన BJPలో చేరాలనుకున్నారని అందుకోసం ఆ పార్టీ నేతలను కూడా కలిసారని ఆరోపణలు చేసారు. కుమారస్వామి ఆరోపణలపై సిద్ధరామయ్య మండిపడ్డారు.