Etela Rajender: లా అండ్ ఆర్డ‌ర్ అదుపులో పెట్టుకో KCR

Hyderabad: తెలంగాణ‌లో లా అండ్ ఆర్డ‌ర్‌ను కంట్రోల్ చేయాల్సిన బాధ్య‌త సీఎం KCRదేన‌ని అన్నారు ఈటెల రాజేంద‌ర్ (etela rajender). తెలంగాణ‌లో జ‌ర్న‌లిస్ట్‌లు, రిపోర్ట‌ల‌పై ప‌లువురు నేత‌లు చేయిచేసుకుంటున్నార‌ని, ఇది లా అండ్ ఆర్డ‌ర్ కిందికి వ‌స్తుంద‌ని తెలిపారు. KCRకు చేత‌కాక‌పోతే తామే ఏదో ఒక చ‌ర్య తీసుకుంటామ‌ని అన్నారు.

దమ్ముంటే దళిత బంధుపై సీఎం KCR చర్చకు రావాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్ లో అందరికీ దళిత బంధు ఇవ్వాలని.. సగం ఇచ్చిన వారికి మిగతా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలందరికీ సాయం చేయాలని.. వారిని ఇన్ కమ్, కాస్ట్ సర్టిఫికెట్లు అడగవద్దన్నారు. బీసీలతో పాటు గౌడ్స్, పద్మశాలి, ముదిరాజ్ అందరికీ కొత్త పథకాన్ని వర్తింపజేయాలని తెలిపారు. ప్రగతి భవన్, సీఎం తిరిగే కారు, పెట్రోల్ ఇదంతా ప్రజల సోమ్ము అని గుర్తు చేసిన ఈటల.. సీఎం ప్రజల సొమ్ముకు కాపాలాదారుడు మాత్రమేనని ఓనర్ కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని, BRS ని ఓడించాలని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. సీపీ హుజూరాబాద్ పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. నిజమైన ఉద్యమ కారులు నిర్మించిన స్థూపాన్ని కూల్చి వేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.