Etela Rajender వ్యాఖ్యలతో BJPకి గట్టి దెబ్బ..!

Hyderabad: హుజూరాబాద్‌ BJP ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ (etela rajender) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో మీడియాతో ఈటల మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. BRS పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి BJPలో చేరతారా అని మీడియా ప్రతినిధులు ఈటలను ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన ఆయన.. వారి దృష్టి కాంగ్రెస్‌పై ఉందని బహిరంగంగా పేర్కొన్నారు. దీంతోపాటు వారు తననే మోటివేట్ చేసి.. వారి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇక ఈటల వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు కంగుతిన్నారు.

బహిరంగ వేదికపై ఇలా మాట్లాడటం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది BJP స్థాయిని తెలియజేస్తుందని ఈటల బహిరంగ ప్రకటన సరికాదని కొందరు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే గత కొంత కాలంగా BJP అధ్యక్షుడు బండి సంజయ్‌ తీరు ఈటలకు నచ్చడం లేదని.. ఇద్దరి మధ్య గ్యాప్‌ ఉందని సమాచారం. మరోవైపు తెలంగాణలో హిందుత్వం అంశం పనిచేయదని.. కేసీఆర్‌ సర్కార్ అవినీతిపై పోరు సాగించాలని ఈటల అంటున్నారు. కానీ ఆ దిశగా బీజేపీ ప్రయత్నం చేయట్లేదు దీంతో పార్టీ పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈక్రమంలో ఈటల సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆయన పార్టీ మారతారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక ప్రజాధరణ ఉన్న 25 మంది నాయకుల కలిసి కొత్త పార్టీ పెట్టేందుకు తెలంగాణలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ టీంకు పొంగులేటి నాయకత్వం వహిస్తున్నారు. వీరి ప్లాన్‌.. వచ్చే ఎన్నికల్లో కామన్‌ సింబల్‌తో వెళ్లి.. 25 సీట్లు గెలుపొందాలని ఆ తర్వాత ఏదొక పెద్ద పార్టీకి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారు.