Etela Rajender: పొంగులేటి.. జూపల్లి కాంగ్రెస్‌నే ప్రేమిస్తున్నారు!

Hyderabad: BRS బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (ponguleti srinivas reddy) , జూపల్లి కృష్ణారావు (jupalli krishna rao) BJPలో చేరడం కష్టమేనని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (etela rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లిని కోరానని కానీ.. వారు కాంగ్రెస్‌నే ప్రేమిస్తున్నారని అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నందునే వారు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ బీజేపీలో చేరడం కష్టమే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాలను పంచుకున్నారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని.. బీజేపీ బలహీనంగా ఉందన్నారు. పొంగులేటి, జూపల్లితో తాను రోజూ మాట్లాడుతున్నానని.. కానీ వారే నాకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారని ఈటల తెలిపారు. ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే నేను ఆపగలిగానని.. కానీ రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయని, ఇప్పటికీ కమ్యూనిస్ట్‌ ఐడియాలజీ ఉన్న జిల్లా ఖమ్మం. దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ. ఖమ్మంలో వామపక్షాలు, తెదేపా సహా అన్ని పార్టీలుంటాయి. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి పొంగులేటితో చర్చించాను అని ఈటల పేర్కొన్నారు. ఈటల వ్యాఖ్యలను బట్టి చూస్తే పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరతారని స్ఫష్టం అవుతోంది. మరి ఎప్పుడు చేరతారు అన్నది మాత్రం మరికొన్ని రోజుల్లో తేలనుంది.