Etela Rajender: అజ్ఞాతంలో ఈటెల‌..!

Hyderabad: BJP నేత ఈటెల రాజేంద‌ర్ (etela rajender) అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఈ మ‌ధ్య‌కాలంలో BJP నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఈటెల దూరంగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేయగా వారు ఈటెలను గట్టిగా మందలించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలయ్యే వరకు అధ్యక్ష పదవి మార్పు ఉండదని స్పష్టం చేయగా ఈటెల అలిగిన‌ట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నార‌ని టాక్. ఇటీవ‌ల కిషన్ రెడ్డి నిర్వహించిన ఓ కార్యక్రమానికి కూడా ఈటెల డుమ్మా కొట్టారు. దాంతో ఈటెల అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా అనే చ‌ర్చ మొదలైంది.

BRS పార్టీలో ఉన్న‌ప్పుడు భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఈటెల‌.. ఆ తర్వాత BJP గూటికి చేరారు. అక్కడికి వెళ్లినా ఆయ‌న బ‌లం హుజూరాబాద్‌లో ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు బీజేపీ తెలంగాణ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇందుకోసం ఈటెల కూడా ఎంతో ఆత్రంగా ఎదురుచూసారు. తీరా చూస్తే ఆయ‌న‌కు ఆడ్మిష‌న్స్ క‌మిటీ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇచ్చారు. దాంతో ఈటెల ఎంతో బాధ‌ప‌డ్డారు. అస‌లు ఈ ప్ర‌పంచంలో ఇలాంటి క‌మిటీ అనేది ఉంటుందా? ఏదో పార్టీ ఇచ్చింది కాబ‌ట్టి ప‌నిచేసాను అని చెప్పి బాధ‌ప‌డ్డారు. మ‌రి ఇప్పుడు ఈటెల దారెటో ఇంకొంత కాలం వేచి చూడాలి. ఆయ‌న మ‌ళ్లీ bRS గూటికి చేరే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. దీనిపై ఈటెలే క్లారిటీ ఇవ్వాలి.