Etela: ఏనాడైనా KCR అల్లాపూర్‌కి వ‌చ్చిండా?

Etela Rajender: తెలంగాణ ఎన్నికల్లో BJP నుంచి ఈటెల రాజేంద‌ర్ KCR నియోజ‌క‌వ‌ర్గం అయిన గ‌జ్వేల్ (gajwel) నుంచి కూడా పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గ‌జ్వేల్‌లోని అల్లాపూర్‌లో ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఏనాడూ కూడా అల్లాపూర్ గ్రామానికి KCR వ‌చ్చింది లేద‌ని కానీ ఇక్క‌డి ప్ర‌జ‌ల ఓట్లు మాత్రం కావాల‌ని విమ‌ర్శించారు ఈటెల‌. KCR ప్ర‌భుత్వ పాల‌న‌లో ముస‌లాయ‌న‌కు పెన్ష‌న్ వ‌స్తే ముస‌ల‌మ్మ‌కు రాద‌ని.. కానీ BJPని గెలిపిస్తే ఇద్ద‌రికీ స‌రైన స‌మ‌యంలో పెన్ష‌న్ ప‌డేలా చేస్తామ‌ని అన్నారు. ఆరోగ్య బీమా కింద రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు చికిత్స‌కు స‌హ‌క‌రిస్తామ‌ని హ‌మీలు ఇచ్చారు.