BJP: ఈటెల, కోమటిరెడ్డికి హై కమాండ్ కాల్
Hyderabad: BJP నేతలు ఈటెల రాజేందర్ (etela rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy)లపై హై కమాండ్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ తెలంగాణలో పార్టీకి సంబంధించి జరుగుతున్న ఏ ఒక్క కార్యక్రమానికి హాజరుకావడం లేదట. ఇంటింటికీ BJP కార్యక్రమానికి కూడా వెళ్లడంలేదన్న విషయం పైదాకా వెళ్లడంతో వెంటనే దిల్లీ రావాలని కేంద్ర మంత్రులు అమిత్ షా (amit shah), జేపీ నడ్డాల (jp nadda) నుంచి కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఈటెలతో పాటు మరికొందరు నేతలు హై కమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై కోపంగా ఉన్నారు. తెలంగాణ BJP అధ్యక్ష పదవి ఇస్తారేమోనని ఈటెల ఎంతో ఆశపడ్డారు. కానీ ఆయనకు అడ్మిషన్స్ కమిటీలో చోటుదక్కింది. అసలు ఇలాంటి కమిటీ దేశంలోనే ఎక్కడా లేదని అయినా పార్టీ కోసమని ఇష్టం లేకపోయినా పనిచేస్తున్నానని అన్నారు.