Kishan Reddy: కిష‌న్ రెడ్డికి ఘోర అవ‌మానం..?

Hyderabad: BJP ఎంపీ, తెలంగాణ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డికి (kishan reddy) అవ‌మానం జ‌రిగిందా? సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నిజ‌మే అనిపిస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మోదీని రిసీవ్ చేసుకోవ‌డానికి కిష‌న్ రెడ్డి (kishan reddy) వెళ్లారు. ఆ స‌మ‌యంలో మోదీ ప్ర‌జ‌ల‌కు న‌మ‌స్తే పెడుతూ వెళ్తుండ‌గా పక్క‌నే కిష‌న్ రెడ్డి (kishan reddy) కూడా ఉన్నారు. అయితే కిష‌న్ రెడ్డి మోదీ ప‌క్క‌న న‌డుస్తుంటే.. వెన‌కే ఉన్న మోదీ బాడీగార్డ్ కిష‌న్‌ను ప‌క్క‌కు నెట్టేసిన‌ట్లు తెలుస్తోంది. దాంతో కిష‌న్ ప‌క్క‌న వేసిన తివాచీపై న‌డుచుకుంటూ వ‌చ్చారు. ఇది నిజంగా అవ‌మాన‌మే అంటూ ప‌లువురు నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.