KTR పై కేసు పెట్టిన ED
KTR: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు వేసింది. BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇంట్లో ఈరోజు ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన రైడ్లు చేసి కవితను అరెస్ట్ చేయాలని చూడగా.. కేటీఆర్ వెంటనే హరీష్ రావుతో కలిసి కవిత ఇంటికి వెళ్లి వారిని నిలదీసారు. దాంతో కేటీఆర్‌కు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు మధ్య గొడవ జరిగింది. తమ విధులను నిర్వర్తించనివ్వకుండా కేటీఆర్ అడ్డుకున్నారంటూ ఈడీ కేటీఆర్‌పై కేసు వేసింది.