ECI: ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ డైలాగ్‌పై ఎన్నిక‌ల సంఘం స్ట్రాంగ్ రియాక్ష‌న్

ECI: ఆంధ్ర‌ప్ర‌దేశ్, లోక్ స‌భ ఎన్నిక‌ల తేదీ ప్ర‌క‌టించేయ‌డంతో ప్రస్తుతం దేశంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ నియ‌మావ‌ళి అమ‌ల్లోకి వ‌చ్చిందంటే సినిమాల్లో కానీ ఇత‌ర ప్ర‌దేశాల్లో కానీ ఎలాంటి పొలిటిక‌ల్ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌కూడ‌దు. ఒక‌వేళ చేయాల‌న్నా కూడా ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో నిన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా టీజ‌ర్ రిలీజ్ అయింది. అందులో జ‌న‌సేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ప‌ట్టుకుని ప‌వ‌న్ కొన్ని ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పారు. గాజంటే సైజు కాదు సైన్యం అంటూ కాస్త పొలిటిక‌ల్ టచ్ వ‌చ్చే డైలాగ్‌ను చెప్పారు. అయితే ఈ డైలాగ్ వ‌ద్ద‌ని ప‌వ‌న్ చెప్పినా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar) ఉండాల్సిందేనని ప‌వ‌న్‌ను ఫోర్స్ చేసాడ‌ట‌. ఈ విష‌యాన్ని ప‌వ‌నే వెల్ల‌డించారు.

అయితే ఈ సినిమాలో గాజు గ్లాస్‌ని చూపిస్తూ ప‌వ‌న్ డైలాగ్ చెప్ప‌డంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించింది. ఇంకా టీజ‌ర్ చూడ‌లేద‌ని ఒక‌వేళ అది పొలిటికల్ యాడ్‌లా క‌నిపిస్తే మాత్రం క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు వెల్ల‌డించారు.