Sajjala: సైలెంట్‌గా ఉండు.. స‌జ్జ‌ల‌పై ఈసీ ఫైర్

Sajjala: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మండిప‌డింది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారులా కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌గా ప్ర‌తిప‌క్షాల‌పై కామెంట్స్ చేస్తున్నార‌ని అస‌లు ఎన్నిక‌ల్లో నీకు ప‌నేంటి.. సైలెంట్‌గా ఉండండి అని మండిప‌డింది. ఎన్నిక‌ల కోడ్ మ‌రిచి మ‌రీ ప్ర‌తిప‌క్షాల‌పై విషం చిమ్ముతున్నార‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వెల్లువ‌లా ఫిర్యాదులు అందాయి. ప్ర‌భుత్వ జీతం తీసుకుంటూ రాజ‌కీయాలు చేస్తున్నారని స‌ల‌హాదారు హోదాలో రాజ‌కీయ నాయ‌కుడిలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఇప్ప‌టికే చాలా ఫిర్యాదులు అందాయి. దాంతో ఎన్నిక‌ల సంఘం మండిపడింది. ఎన్నిక‌లు స‌జావుగా సాగాలంటే వెంట‌నే స‌జ్జ‌లను స‌ల‌హాదారు ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఎన్నిక‌ల సంఘం సజ్జ‌ల‌పై నిఘా వేసి ఉంచింది.