Election Announcement: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే
Election Announcement: సార్వత్రిక ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) తేదీని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలకు అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌తో కలిపి నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో 97 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతోన్నాని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 1.82 కోట్ల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.
నోటిఫికేషన్- ఏప్రిల్ 18
నామినేషన్ల చివరి తేదీ – 26 ఏప్రిల్
నామినేషన్ల ధృవీకరణ తేదీ – ఏప్రిల్ 26
నామినేషన్ల విత్‌డ్రా తేదీ – ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ – మే 13
ఫలితాలు – జూన్ 4
ఇక తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల తేదీ.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తేదీ ఒక్కటే కావడం గమనార్హం. తెలంగాణలో కూడా మే 13న పోలింగ్ ఉంటుంది. అన్ని ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.