Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లికి ఏడేళ్ల జైలు శిక్ష ప‌డే అవ‌కాశం

ec serious on Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో మాచ‌ర్ల‌లోని ఓ పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి విధ్వంసం సృష్టించారు. ఈవీఎం మెషీన్‌ను ధ్వంసం చేసి ఓ మ‌హిళ ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు బ‌య‌టికి రావ‌డంతో ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయ్యింది. వెంట‌నే పిన్నెల్లిని అదుపులోకి తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసారు. ఈ నేప‌థ్యంలో పిన్నెల్లి హైద‌రాబాద్ ద్వారా గోవాకు పారిపోవాల‌ని య‌త్నించ‌డంతో పోలీసులు మార్గ మ‌ధ్య‌లో అరెస్ట్ చేసారు. ఆయ‌న‌కు ఎంత కాద‌న్నా ఏడేళ్లు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది.