Dwarampudi: పవన్.. నీ పెళ్లిళ్ల గురించి మాట్లడాల్సి వస్తది
AP: ఇంకోసారి వ్యక్తిగతంగా దూషిస్తే.. నేను కూడా నీ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది అని జనసేనాని (janasena) పవన్ కళ్యాణ్‌కు (pawan kalyan) కౌంటర్ ఇచ్చారు YCP ఎంపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (dwarampudi chandrasekhar reddy). వారాహి యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్..నిన్న కాకినాడ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వారంపూడిపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి (dwarampudi) నేర సమ్రాజ్యాన్ని కూలగొడతానని, అలా చేయకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని, తన పార్టీ జనసేన కాదని పవన్ ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలో ద్వారంపూడి స్పందించారు. ఇంకోసారి తనను పర్సనల్‌గా ఎటాక్ చేస్తే.. తాను కూడా పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడాల్సి వస్తదని అన్నారు. పవన్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడని అన్నారు. కావాలంటే.. సినిమాలు చేసుకుంటూ అందులో ఎమ్మెల్యే, సీఎం అయినట్లు నటించాలని ఎగతాళి చేసారు. దమ్ముంటే తనపై కాకినాడలో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు.