Duvvada Srinivas: పార్టీ నుంచి దువ్వాడ సస్పెండ్?
Duvvada Srinivas: వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు వారాలుగా దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలతో కుటుంబ రచ్చ రోడ్డుకెక్కింది. అసలే 11 సీట్లకే పరిమితం అవడంతో ఇంకా పార్టీ డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు జగన్ దువ్వాడ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలనుకుంటున్నారట.
దువ్వాడ స్వయంగా రాజీనామా చేస్తే ఫర్వాలేదని.. లేదంటే పార్టీ నుంచి తప్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. రాజీనామా చేయడానికి దువ్వాడ ఒప్పుకున్నారని కాకపోతే తన రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి సమస్య రాదని హామీ ఇస్తేనే రాజీనామా చేస్తానని అన్నారట. అదేపనిగా గంటా శ్రీనివాస్ రావుని, పవన్ కళ్యాణ్‌ని పట్టుకుని మూడు పెళ్లిళ్లు అక్రమ సంబంధాలు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేసేవారు. ఇప్పుడు సొంత పార్టీలోనే ఇలాంటి నేతలు ఉండటంతో వారు నోరు మెదపలేకపోతున్నారు.