Nara Lokesh: పురుషుల ఫోన్ల‌లో దిశా యాప్.. అనుమానాలున్నాయ్

Nara Lokesh: జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని మండిప‌డ్డారు నారా లోకేష్. తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదని మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని ఆరోపించారు. మహిళలు వేసుకోవాల్సిన దిశ యాప్ పురుషుల మొబైల్‌లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం అనుమానాలకి తావిస్తోందని ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణమ‌ని అన్నారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి అని మండిప‌డ్డారు.