Dundi Rakesh: మద్యం మాఫియాల్లో మునిగి తేలుతున్న YCP నాయకులు
Dundi Rakesh: వ్యాపారులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు విధానాలు శ్రుతిమించాయని, సొంతడబ్బుతో పెట్టుబడి పెట్టుకొని, కష్టాన్ని నమ్ముకొని, పడాల్సిన బాధలు పడుతూ ఉదయం నుంచి రాత్రివరకు వ్యాపారం చేసుకొని వచ్చే ఆదాయంలో న్యాయంగా కట్టాల్సిన పన్నులు కడుతూ గౌరవంగా బతుకు తున్న వ్యాపారులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడటం బాధాకరమని, జగన్ రెడ్డి దృష్టిలో వ్యాపారులంటే భారతి గారేనని, భారతి సిమెంట్స్..భారతి టెలివిజన్ .. భారతి ఐరన్ ఫ్యాక్టరీలు తప్ప మరే ఇతర వ్యాపారాలు.. వాణిజ్యసంస్థలు.. చిన్నచితకా వ్యాపారులు.. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరూ ముఖ్యమంత్రికి కనిపించడం లేదని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!
“””” వ్యాపార వర్గాలపై దాడులు..వేధింపులు ఆపాలని గతంలో ఎన్నోసార్లు వాణిజ్య సంఘాలు YSRCP ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యాపారులు.. ఆపార్టీకి అండగా నిలిచే వ్యాపారులపైకి ప్రభుత్వం పోలీస్ శాఖను ఉసిగొల్పింది. తెల్లారక ముందే ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా.. ఏ విధమైన అనుమతులు లేకుండా టీడీపీ నేత, మాజీమంత్రి నారాయణ సహా, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో పోలీసులు తనిఖీల పేరుతో నానాహంగామా సృష్టించారు. ఇళ్లలో ఉండే నగదు.. బంగారం తీసుకెళ్లి.. అందరినీ స్టేషన్లకు తరలించడం పరిపాటిగా మారింది.
ఇదంతా గమనించాక నెల్లూరు పెద్దారెడ్లు అంతా మూకుమ్మడిగా జగన్ రెడ్డిని ఛీ కొట్టడంతో, వారంతా తనకు వ్యతిరేకం కావడంతో చివరకు వారి వ్యాపారాలపై దాడులు చేయిస్తున్నాడు. వ్యాపార వ్యవహారాలతో పోలీసులకు ఏమి పని? ఫేక్ రిజిస్ట్రేషన్లతో వ్యాపారాలు చేస్తే, వాటికి సంబంధించిన ఆధారాలు చూపించి, సదరు వ్యక్తుల్ని ప్రశ్నించి, తప్పు చేసినట్టు తేలితే, సంబంధిత విభాగం వారికి అప్పగించాలి. అది చేయకుండా తనిఖీల పేరుతో పోలీసులు ఇళ్లలోకి చొరబడి బీరువాలు…లాకర్లు…బెడ్రూమ్ లు… కిచెన్ లు వెతకడం ఏమిటి? నగదు ఉం దా.. బంగారం ఉందా అని వెతికే అధికారం పోలీసులకు ఎక్కడిది? ఇష్టమొచ్చిన ట్టు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లోకి చొరబడి తనిఖీల పేరుతో ఏమైనా చేయొచ్చని పోలీసులకు ఎవరు చెప్పారు? ఒకవేళ తనిఖీలు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా నోటీసులు ఇవ్వడం.. సంబంధిత వ్యక్తుల్ని విచారణకు పిలవడం…ఇలా అంతా నిబంధనలప్రకారం జరగాలి. కానీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
TDP సానుభూతిపరులైన వ్యాపారుల ఇళ్లలో వెతికితే ఏమొస్తుంది? వైసీపీ నేతలు.. ఆపార్టీ సానుభూతిపరులైన వ్యాపారుల ఇళ్లల్లో వెతికితే కళ్లు చెదిరిపోయే, మతి భ్రమించే సంపద వెలుగుచూస్తుంది. ఇసుక, ఎర్రచందనం, ఖనిజ సంపద, మద్యం అమ్మకాల దోపీడీతో వేలకోట్లు దోచేసిన మంత్రి పెద్దిరెడ్డి.. ఇసుక మాఫియాను నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ప్రస్తుత మంత్రులు, వైసీపీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో వెతికితే వేలకోట్ల నగదు..బంగార..ఇతర ఆస్తులపత్రాలు లభిస్తాయి. రాష్ట్రాన్ని ప్రజల్ని దోచేసుకున్నవారిని వదిలేసి, కష్టపడి బతికే వ్యాపారులపై వేధింపులు ఏమిటి? ఈ ముఖ్యమంత్రి చేతగాని దద్ద మ్మ కాబట్టే.. నేడు రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టింది. రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు.. కంపెనీలు తీసుకొచ్చాను…ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి.. పన్నులరూపంలో ఇంతఆదాయం వచ్చిందని చెప్పే ధైర్యం లేని జగన్ రెడ్డి, చివరకు ఇలా బరితెగించి వ్యాపార, వాణిజ్య వర్గాలపై తనిఖీలపేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. పక్కజిల్లా నుంచి వచ్చిన అధికారులమంటూ కొద్దిరోజుల క్రితం పర్చూరులో కారం పొట్లాలతో వచ్చిమరీ తనిఖీలు జరిపారు. అవేమీ తనిఖీలో ఈ ముఖ్యమంత్రే చెప్పాలి. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం బీహార్ కంటే దారుణంగా తయారైంది అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి?
పబ్జీ గేమ్ ఆడుకున్నంత తేలిగ్గా జగన్ రెడ్డి వ్యాపారులపై దాడులు చేయిస్తే చూస్తూ ఊరుకోం. TDP వాణిజ్యవిభాగం రాష్ట్రంలోని వ్యాపారులకు అండగా ఉండి ప్రభుత్వ వేధింపుల్ని ప్రతిఘటిస్తుంది. రాష్ట్రంలో ఏ వ్యాపారమైనా.. ఏ సంస్థ అయినా సక్రమంగా పనిచేసుకోగలుగుతున్నాయా? స్పిన్నింగ్ మిల్లులు.. గ్రానైట్ పరిశ్రమ.. సిమెంట్ కంపెనీలు.. రైస్ మిల్లుల యాజమాన్యాలు.. రియల్ ఎస్టేట్.. ఆఖరికి బట్టల దుకాణాలు.. బెల్లం వర్తకులు.. ప్లెక్సీ ప్రింటర్ల యాజమాన్యాల వారిని కూడా జగన్ వదల్లేదు. వ్యాపారాలన్నీ ఆయనొక్కడే చేసుకోవాలి ..రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదు.. అనే నియంత్రత్వ ధోరణితో వ్యవహరిస్తున్న జగన్ రెడ్డిని, అతనిప్రభుత్వాన్ని వ్యాపారవర్గాలు తరిమికొట్టే రోజు దగ్గర కొచ్చిం ది. ఏ విభాగమైనా.. ఏ అధికారి అయినా పద్ధతి ప్రకారం..నిబంధనలకు తగినట్టు నడుచుకోవాలని సూచిస్తున్నాం. అంతేగానీ ప్రభుత్వ ఆదేశాలనో.. ముఖ్యమంత్రి చెప్పాడనో.. మరో నాయకుడు చెప్పాడనో వ్యాపారుల్ని వేధిస్తే చూస్తూ ఊరుకోం. తప్పుచేస్తున్న అధికారులందరినీ కోర్టుల ముందు నిలబెట్టి శిక్షపడేలా చేస్తాం. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య వర్గాలపై జరుగుతున్న దాడులు.. తనిఖీల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న తీరుపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలి. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి . నెల్లూరులో నేడు జరిగిన తనిఖీలు.. దాడుల వివరాలను పోలీస్ శాఖ వెంటనే బయట పెట్టాలి. లేకుంటే సాయంత్రానికి నెల్లూరు వెళ్లి.. వ్యాపారులకు అండగా నిలిచి, తప్పుచేసిన పోలీసుల ఆటకట్టిస్తాం “””” అని రాకేశ్ హెచ్చరించారు.