Donald Trump: ఓడిపోతే అమెరికా వ‌దిలి వెళ్లిపోతా

Donald Trump says he will leave usa if lost in elections

Donald Trump: త్వ‌ర‌లో అమెరికాలో జ‌ర‌గ‌నున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తాను కానీ ఓడిపోతే అమెరికా వ‌దిలి వెళ్లిపోతాన‌ని అన్నారు మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా వ‌దిలేసి వెనెజ్వెలాకి వెళ్లిపోతాన‌ని వెల్ల‌డించారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్య‌ల‌ను చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

వెనెజ్వెలాకే ఎందుకు వెళ్లాల‌నుకుంటున్నారు అని మ‌స్క్ అడ‌గ్గా.. ఇప్పుడు వెనెజ్వెలాలోని క్రిమిన‌ల్స్‌ని అమెరికా జైళ్ల‌కు పంపుతున్నార‌ని.. అలా వెనెజ్వెలా సుర‌క్షిత‌మైన దేశంగా మారుతోంద‌ని తెలిపారు. కానీ అమెరికాలో మాత్రం క్రైం రేటు పెరుగుతోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ట్రంపే కాదు.. 2022లో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేసాడు. ఒక‌వేళ ర‌ష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో ర‌ష్యా ఓడిపోతే.. తాను అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసి వెనెజ్వెలాకు పారిపోతాన‌ని అన్నారు.