EXCLUSIVE: రచ్చ గెలిచి ఇంట గెలుస్తారా..!
EXCLUSIVE: సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (ap elections) ముందు మళ్లీ పుట్టింట్లో అడుగుపెట్టింది వైఎస్ షర్మిళ (ys sharmila). మొన్నటివరకు మెట్టినిల్లు మెట్టినిల్లు అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి KCRను గద్దె దించేవరకు పోరాడిన షర్మిళ ఇప్పుడు సొంత అన్ననే (jagan mohan reddy) ఎదిరించేందుకు రంగంలోకి దిగింది. అన్నను పట్టుకుని జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని సంబోధిస్తూ ప్రచారాల్లో దుమ్ము దులుపుతున్న షర్మిళను YSRCP పార్టీ వారు కూడా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతున్నారు. మరోపక్క జగన్ కూడా తక్కువ తినలేదు. చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్‌గా షర్మిళ పనిచేస్తోందని రివర్స్ పంచ్‌లు వేసారు. ఇక ఈ అన్నాచెల్లెళ్లు ఇంకెంత మితిమీరి తిట్టుకుంటారో చూడాలి.
జగన్ ప్లాన్ ఏంటి?
జగన్‌కు కావాల్సింది ఏంటి.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా తానే సీఎం అవ్వాలి. ఇందుకు చెల్లెలిని ఎందుకు పక్కన పెట్టాలి? చెల్లెలికి ఏం కావాలో అది ఇచ్చేస్తే పోలే..? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇంట గెలవలేని వారు ఇక రచ్చనెక్కి ఏం సాధిస్తారు? సరిగ్గా జగన్ మైండ్‌లో ఇదే రన్ అవుతున్నట్లుంది. షర్మిళ తీరు అదో టైప్. ఆమె ముందు రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట గెలవాలని అనుకుంటున్నారు. అందుకే పార్టీ పెద్దలతో చర్చించి షర్మిళను మెల్లిగా తమ వైపునకు తిప్పుకుంటే ఎలా ఉంటుంది అనే కోణంలో పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.