Telangana Elections: BJP.. BRS గెలవాలనే కోరుకుంటోందా?
తెలంగాణ ఎన్నికల్లో (telangana elections) భారత రాష్ట్ర సమితి (BRS) గెలవాలనే భారతీయ జనతా పార్టీ (BJP) కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం కాంగ్రెస్ (congress) ఆరోపిస్తున్నట్లు BRS.. BJPకి బి టీం అని కాదు. తెలంగాణ ఎన్నికల్లో BRS ఓడిపోవడం కంటే.. కాంగ్రెస్ గెలవకూడదు అనే కోరికే BJPలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందంటే.. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) BJPకి కష్టం అవుతుంది.
నిజానికి BJP తెలంగాణ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసేది కూడా భారత రాష్ట్ర సమితి గెలవాలనే. KCRని ఎక్కువగా టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ గెలవకూడదు అనే ప్లాన్‌లో భారతీయ జనతా పార్టీ ఉంది. భారత రాష్ట్ర సమితి గెలిస్తే చివరికి వారు సాయం కోసం భారతీయ జనతా పార్టీ వద్దకే వస్తారని వారి నమ్మకం. ఆల్రెడీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గాలి తుస్సుమంది. ఇప్పుడు వారి ఓట్లు కాంగ్రెస్‌కు కాకుండా భారత రాష్ట్ర సమితికి పడితేనే బెటర్ అని భావిస్తున్నారట. (telangana elections)
మరోపక్క కాంగ్రెస్ కూడా ఇదే వాదన వినిపిస్తోంది. BJP, BRS కలిసిపోయాయని అంటోంది. దీని వల్ల ఆ రెండు పార్టీలకే లాభం అని రాజకీయ నిపుణులు అంటున్నారు. తెలంగాణలో BJP ఓటు శాతం 10 శాతానికి పడిపోయినా కూడా ఆ లాభం కాంగ్రెస్‌కే ఉంటుందని వారికి కూడా తెలుసు. అదే BJP ఓటు శాతం 15కి పెరిగినా కూడా అది భారత రాష్ట్ర సమితికే కలిసొస్తుందని అంటున్నారు. కానీ ఇక్కడ మరో రిస్క్ ఉంది. BJP KCR.. భారత రాష్ట్ర సమితిపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు సీరియస్‌గా తీసుకుంటే.. వారు భారత రాష్ట్ర సమితికి వేయాల్సిన ఓట్లు కాంగ్రెస్‌కు పోతాయి. ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఓటర్ల చూపు ఎవరి వైపు ఉందో తెలిసిపోతుంది.