పవన్‌కు DMK చురక.. మాట్లాడతాం మళ్లీ మాట్లాడతాం
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తమిళనాడుకి చెందిన అధికార పార్టీ DMK గట్టి సమాధానం ఇచ్చింది. నిన్న పవన్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభను ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఇంకోసారి అలా మాట్లాడితే సహించబోనని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై DMK ప్రజాప్రతినిధి అయిన సయ్యద్ హఫీజుల్లా స్పందించారు. మేమెప్పుడూ సనాతన ధర్మం గురించి తప్పుగా అనలేదు. కానీ కుల వివక్ష, అంటరానితనం గురించి మాత్రం మాట్లాడతాం. మళ్లీ మళ్లీ మాట్లాడతాం అని బదులిచ్చారు.
గతేడాది ఉదయనిధి స్టాలిన్ ఓ పబ్లిక్ సమావేశంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ అది మలేరియా, డెంగూల కంటే భయంకరమైనది అన్నారు. ఆ తర్వాత దీనిపై కోర్టులో పిటిషన్ వేయగా.. తాను సనాతన ధర్మం గురించి మాట్లాడలేదని.. కానీ సనాతన ధర్మం పేరుతో చేస్తున్న అకృత్యాలు, అంటరానితనం గురించి వ్యాఖ్యానించానని అన్నారు.