జ‌గ‌న్ పార్టీని కాంగ్రెస్‌లో చేర్చుకోండి.. సోనియాకు DMK రిక్వెస్ట్

dmk requests sonia gandhi to merge ysrcp in congress

YSRCP: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో చేర్చుకోవాల‌ని త‌మిళ‌నాడుకి చెందిన DMK పార్టీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని రిక్వెస్ట్ చేసింది. దీని వ‌ల్ల ఇండియా కూట‌మి బ‌లం మ‌రింత పెరుగుతుంద‌ని వారు స‌ల‌హా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో రేపు సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేలు ఢిల్లీలో స‌మావేశం కానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌లో క‌లుపుకోవ‌డంపై సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. మొన్న జ‌రిగిన ఢిల్లీ ధ‌ర్నాలో జ‌గ‌న్‌కు ఇండియా కూట‌మికి చెందిన దాదాపు 8 పార్టీలు మ‌ద్ద‌తు ఇచ్చాయి. ఆ పార్టీలో డీఎంకే కూడా ఉంది. ఆ ధ‌ర్నా త‌ర్వాతే వారు సోనియాకు వైఎస్సార్ కాంగ్రెస్‌ను కాంగ్రెస్ పార్టీలో క‌లుపుకోవ‌డంపై లేఖ రాసారు. మ‌రి దీనిపై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.