DK Suresh: అన్నను సీఎం చేస్తారనుకున్నా.. సంతోషంగా లేను
Bengaluru: తన అన్న డీకే శివకుమార్‌ను(dk shivakumar) సీఎం చేస్తారనుకుంటే మళ్లీ నిరాశే ఎదురైందని బాధపడ్డారు డీకే సురేష్(kd suresh). కాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్యకు(siddaramaiah) అప్పగించింది. డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎంను చేసింది. ఆ పదవిలో ఉంటూనే ఆయన కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గానూ వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో డీకే సురేష్(dk suresh) మీడియాతో మాట్లాడారు. ఈ నిర్ణయంతో తాను సంతోషంగా లేనని తెలిపారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ(bjp).. కాంగ్రెస్(congress) తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. రాష్ట్రానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో డీకే కానీ సిద్ధా కానీ లేరని, సొంత లాభాల కోసమే పదవి కోసం ప్రాకులాడుతున్నారని కర్ణాటక మాజీ సీఎం సదానంద గౌడ(sadananda gowda) అన్నారు. రాజస్థాన్‌లో(rajasthan) ఇద్దరు సీఎంల మధ్య ఏం జరుగుతోందో కర్ణాటకలోనూ అదే జరగబోతోందని తెలిపారు.