DK Aruna: చంద్రబాబుకి పట్టిన గతే రేవంత్‌కీ పడుతుంది
Hyderabad: రియల్ ఎస్టేట్‌తో డబ్బు సంపాదించే రేవంత్ రెడ్డికి (revanth reddy) రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయి అంటూ TPCC అధ్యక్షుడిని విమర్శించారు BJP నేత డీకే అరుణ (dk aruna). రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ అమెరికాలోని తానా సభలో రేవంత్ చేసిన కామెంట్ల డీకే అరుణ ఫైర్ అయ్యారు. 2003లో వ్యవసాయం దండగ అన్న అప్పటి సీఎం చంద్రబాబుకు ప్రజలు ఎలా బుద్ది చెప్పారో.. ఇప్పుడు రేవంత్ పరిస్థితి కూడా అదే కాబోతుందని అన్నారు. రేవంత్ (revanth reddy) వ్యాఖ్యలపై ఇప్పటికే BRS కూడా మండిపడుతోంది. రేవంత్ క్షమాపణలు చెప్పేవరకు వదిలేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) ధర్నా చేపట్టారు. మరోపక్క సొంత పార్టీ నుంచి కూడా రేవంత్‌కు వ్యతిరేకత ఎదురైంది. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని TPCC సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. విషయం హైకమాండ్ వరకు వెళ్లకముందే రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పేస్తే మంచిది.