Divvela Madhuri: త్వరలో మా కథ సినిమాగా రాబోతోంది
“” త్వరలో మా కథ సినిమాగా రాబోతోంది. ఇద్దరు నిర్మాతలు మమ్మల్ని సంప్రదించారు. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాం. కొన్ని రోజుల క్రితం నాది శ్రీనుగారిది ఆడియో అంటూ వైరల్ చేసారు. ఆ వాయిస్‌లు మావి కావు. ఎందుకంటే శ్రీను నన్ను అమ్మా అని పిలవడు. నేను ఆయన్ను ఏవండి అని పిలవను. నేను శ్రీనుని రాజా అని పిలుస్తాను. ఎందుకంటే నా ముద్దు పేరు రాజేశ్వరి. శ్రీను నాకు రాజుతో సమానం. అందుకే రాజా అని పిలుస్తాను. ఇక ఇంటి గురించి అంటారా.. ప్రస్తుతం శ్రీను గారు ఉంటున్న ఇంటిని మేం పార్టీ కార్యాలయంగా వాడుకుంటాను. వాడుకునేవాళ్లం. ఒక వెయ్యి మంది వరకు మనుషులు పట్టేంత విశాలంగా ఉంది ఈ ఇల్లు. ఈ ఇంటికి కోసం నేను రూ.2.5 కోట్లు ఇచ్చాను. ఆ డబ్బులు నాకు ఇవ్వలేక శ్రీను ఈ ఇంటిని నాపేరు మీద రిజిస్టర్ చేసేసారు.
ప్రస్తుతం శ్రీను భువనేశ్వర్‌లో ఉన్నారు. తర్వాత ఆయన కార్యచరణ ఏంటి అనేది నాకు తెలీదు. ఆయన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందని అంటున్నారు. ఆయన్ను ఎవ్వరూ సస్పెండ్ చేయలేదు. శ్రీను గారే జగన్ అన్న దగ్గరికి వెళ్లి అన్నా నా కుటుంబంలో సమస్య ఉంది. నేను ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోతున్నాను. ఇంకెవరికైనా ఈ ఎమ్మెల్సీ పదవిని.. టెక్కలి ఇన్‌ఛార్జి పదవిని ఇవ్వండి అని ముష్టి పడేస్తే అది వేరే వారికి భిక్షగా వెళ్లింది. అంతేకానీ ఆయన్ను ఎవ్వరూ తీసేయలేదు. రాజు ఎక్కడున్నా రాజే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే శ్రీను ఇండిపెండెంట్‌గా గెలిచి చూపిస్తారు.
నాకు శ్రీను టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి అయితే చూడాలని ఉంది. నాకు ఈ ఇంటిపై ఆశలు ఏమీ లేవు. మా నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. మాకు నాలుగైదు విల్లాలు ఉన్నాయి. ఈ ఇంటి కోసమే పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే నా ఇంటిని శ్రీనివాస్ భార్య వాణి కబ్జా చేయాలని చూస్తోంది కాబట్టి నా పేరున రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. ఇక భార్యాభర్తల గొడవ వారికి వారే చూసుకోవాలి “” అని వెల్లడించారు.