Duvvada Srinivas: దువ్వాడ ఇంట్లో మాధురి
ఇంతవరకు బాగానే ఉంది.. గొడవ కాస్త సర్దుమణిగింది అనుకుంటున్న సమయంలో ఈరోజు మాధురి ఏకంగా శ్రీనివాస్ ఇంట్లో దర్శనమిచ్చారు. శ్రీనివాస్ ఇంటి మేడపై ఫోన్ మాట్లాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ మీడియాకు కనిపించడంతో ఆమె వెంటనే ముఖానికి చున్నీ కట్టేసుకుని మీడియా వారు లోపలికి ఎలా వస్తారు అంటూ వారిపై కేకలు వేసారు. ఓ పక్క మీడియా వర్గాలు మాధురి వీడియోలు ఫోటోలు తీస్తుంటే.. మాధురి కూడా మీడియా వారి ముఖాలు కనిపించేలా ఫోటోలు తీసారు.
తన భర్త ఇంట్లోకి మాధురి వెళ్లిందని శ్రీనివాస్ భార్య వాణికి ఆమె కూతురుకి సమాచారం అందడంతో వారు వెంటనే శ్రీనివాస్ ఇంటికి చేరుకుని రచ్చ చేసారు. వారిద్దరూ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. దాంతో వాణి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. అన్యాయం తనకు జరుగుతుంటే మాధురికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు.