నా భార్య నన్ను అమ్మలా చూసుకుంది.. మాధురికే నా సపోర్ట్ అంటున్న భర్త
Divvela Madhuri: వైఎస్సార్ కాంగ్రెస్ టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రచ్చకు ఇంకా ఫుల్‌స్టాప్ పడలేదు. ఈరోజో రేపో మ్యాటర్ ఓ కొలిక్కి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దివ్వెల మాధురి భర్త మహేష్ అమెరికా నుంచి తన స్పందనను తెలియజేసారు. తన భార్య ఏంటో తనకు తెలుసని.. తనను ఓ భార్యలానే కాకుండా ఓ అమ్మలా చూసుకుందని.. అలాంటి ఆవిడని పట్టుకుని దువ్వాడ వాణి చేస్తున్న ఆరోపణలు సబబు కాదని అన్నారు.
నిజానికి తాను తెలుగు దేశం పార్టీ అభిమానినని.. కానీ తన భార్య మాధురి జగన్ మోహన్ రెడ్డి అభిమాని కావడంతో ఆమెను రాజకీయాల్లోకి రమ్మన్నారని.. తనకు ఇష్టం లేకపోయినా మాధురి కోసం ఓకే చెప్పానని అన్నారు. మాధురి మంచి డ్యాన్సర్ అని ఆమె చేస్తున్న డ్యాన్సుల గురించి కూడా తప్పుడు వ్యాఖ్యలు చేసారని అన్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురికి తనకు ఓ మంచి ఫ్రెండ్ అని.. ఈ విషయంలో ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తన మద్దతు మాత్రం తన భార్య మాధురికే అని అన్నారు.