జగన్‌ను ఇండియా కూటమిలోకి ఆహ్వానించిన సోనియా?
Jagan: కాంగ్రెస్ హైకమాండ్ నుంచి జగన్ మోహన్ రెడ్డికి పిలుపు వచ్చిందా? తెలుగు దేశం, జనసేన పార్టీలతో భారతీయ జనతా పార్టీ చేతులు కలపడంతో జగన్ ఒంటరి అయిపోయాడని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ భావించారా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా ఉంది కాబట్టి.. తనను ఇండియా కూటమితో చేతులు కలపాలని సోనియా గాంధీ జగన్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన కొందరు సీనియర్ నేతలు జగన్‌కు రాయబారాలు పంపుతున్నట్లు సమాచారం.
ఒకవేళ జూన్ 4న వెలువడబోయే ఎన్నికల్లో జగన్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కీలక పార్టీగా మారుతుంది. అప్పుడు కేంద్రంలో ఎవరు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం జగన్ కీలక నేత అవుతారు. అందుకే ముందుగానే కాంగ్రెస్ హైకమాండ్ తమ ఇండియా కూటమిలో వైస్సార్ కాంగ్రెస్‌నే చేర్చుకోవాలని సన్నాహాలు చేస్తోందట. మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ పార్టీ తెలుగు దేశం, జనసేన పార్టీలతో చేతులు కలిపింది కాబట్టి ఎన్నికల్లో గెలిస్తే జగన్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వరనే టాక్ ఉంది. అందుకే జగన్‌ను తమవైపుకు తిప్పుకోవాలని ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది.