Pawan Kalyan: ఆ సీటు వదిలేసారా?
AP: జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) రాబోయే ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. గాజువాక, భీమవరం, పిఠాపురం, తిరుపతి, కాకినాడ రూరల్. ఈ ప్రాంతాల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. ఇవన్నీ కాపు ఓట్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలు. కాబట్టి ఈసారి పవన్‌కు ఓట్లు పడే అవకాశం ఎంతో కొంత ఉంది. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో నుంచి ఒకటి ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఆ ఒక్కటి పిఠాపురం నియోజకవర్గం.
ఆ నియోజకవర్గం నుంచి జనసేన (janasena) పార్టీ తరఫున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (tangella uday srinivas) అనే వ్యక్తి పోటీ చేస్తారు. ఇతనికి టీ టైం అనే చాయ్ బిజినెస్ ఉంది. జనసేనకు ఫండ్స్ ఇచ్చే వ్యక్తుల్లో ఉదయ్ ఒకరు. ఇప్పుడు పవన్ ప్రచారాల కోసం వాడుతున్న వారాహి వెహికిల్ కూడా ఉదయ్ స్పాన్సర్ చేసినదేనట. ఉదయ్ రిక్వెస్ట్ మేరకు.. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసుకునేందుకు పవన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దాంతో పవన్ పోటీ చేయాలనుకున్న ఐదు నియోజకవర్గాల నుంచి ఒకటి పోయినట్లే. 2019లో పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ దారుణంగా ఓడిపోయారు. దాంతో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి తీరాలని పవన్ నడుం బిగించారు.