Mynampally Rohit: ఎమ్మెల్యేగా గెలిచి నెల కాలేదు.. అప్పుడే వార‌సుడి బెదిరింపులు..!

Mynampally Rohit:  కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు (mynampally hanumanth rao) కుమారుడు మైనంప‌ల్లి రోహిత్ ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్‌లో ఓ జ‌ర్న‌లిస్ట్‌తో రోహిత్ వాగ్వాదం జ‌రిగింది. సిద్ధిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే జ‌ర్న‌లిస్ట్‌తో రోహిత్ వాగ్వాదానికి దిగాడ‌ట‌. మాటా మాటా పెర‌గ‌డంతో శ్రీనివాస్ రెడ్డిని చంపేస్తానని రోహిత్ బెదిరించాడు. ఈ విష‌యాన్ని శ్రీనివాస్ రెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోహిత్ అప్పుడే మీడియాతో విభేదాలు పెట్టుకుంటున్నాడ‌ని.. వారిని బెదిరించ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అనే చ‌ర్చ మొదలైంది.