AP Elections: ప్రశాంత్‌ని జగనే పంపించారా..?
AP Elections: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐప్యాక్ (ipac) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (prashant kishore) ఈరోజు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని (chandrababu naidu) కలిసారు. నారా లోకేష్‌తో (nara lokesh) కలిసి ఆయన ఒకే విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. దాంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఐప్యాక్ ప్రస్తుతం జగన్ కోసం పనిచేస్తోంది. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వల్లే జగన్ (jagan mohan reddy) గెలవగలిగారు. అలాంటి జగన్ అంత సులువుగా ప్రశాంత్‌ను పక్కనపెట్టేస్తారా?
అయితే తెలుగు దేశం పార్టీ జనసేనతో (janasena) పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఎలాంటి ప్లాన్లు వేస్తోందో తెలుసుకునేందుకు జగనే ప్రశాంత్‌ను చంద్రబాబును కలిసేలా ప్లాన్ వేసారన్న టాక్ కూడా వినిపిస్తోంది. చంద్రబాబును గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ మంచి ప్లాన్లు వేస్తున్నట్లే వేసి జగన్‌కు గెలుపు బాటను వేస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతానికి ఏపీ ఐప్యాక్‌తో టచ్‌లో లేరు. ఏపీలో ఐప్యాక్‌ను రిషి రాజా సింగ్ అనే వ్యక్తి చూసుకుంటున్నారు. ఆయన జగన్‌ను గెలిపించేందుకు కృషి చేస్తున్నామని ఓసారి ట్వీట్ కూడా చేసారు. అయినప్పటికీ జగన్‌తో ప్రశాంత్ కిశోర్ టచ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. పై పైకి మాత్రం దూరంగా ఉంటున్నానని.. పార్టీ గెలిచేందుకు ప్లాన్లు మాత్రమే చెప్పేందుకు ఉన్నాను కానీ ఏ పార్టీతో ఎలాంటి పర్సనల్ కనెక్షన్లు లేవని కూడా ప్రశాంత్ అంటుంటారు. కానీ జగన్ వల్ల ప్రశాంత్ బాగానే లాభపడ్డారు. అలాంటిది జగన్ తనను గెలిపించిన వ్యక్తిని ప్రతిపక్షానికి వదిలేసారంటే నమ్మశక్యంగా లేదు..!