EXCLUSIVE: 170 కోట్లు అడిగారా?
EXCLUSIVE: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) YSRCPకి ఆల్మోస్ట్ రాం రాం చెప్పేసారు. దాంతో బాలినేనిని బుజ్జగించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) రంగంలోకి దిగినా ఆయన వినిపించుకోవడంలేదు. ఇందుకు కారణం జగన్‌ను (jagan mohan reddy) కలిసేందుకు కొంతకాలంగా తాడేపల్లిగూడెం ప్యాలెస్ వద్ద ఎంత పడిగాపులు కాసినా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడమే. దాంతో బాలినేనికి ఒళ్లు మండింది.
మాగుంటకి ఇస్తేనే
మరోపక్క ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు తప్ప మరో వ్యక్తికి మద్దతు ఇవ్వనని బాలినేని తేల్చి చెప్పారు. అయితే ఇందుకు జగన్ ఒప్పుకోలేదు. మాగుంటకు టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను ప్రెస్ మీట్లలో నోటికొచ్చినట్లు తిట్టడంతో పాటు రూ.170 కోట్లు డిపాజిట్ చేయాలని అడిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు మాగుంట ఒప్పుకోకపోవడంతో జగన్.. తనకు ఆప్తుడైన చెవిరెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఖరారు చేసారు.
నీకో దండం నీ సీఎంకో దండం
చెవిరెడ్డికి ఎంపీ టికెట్ కన్ఫామ్ అవ్వడంతో తనకు మద్దతు తెలపాల్సిందిగా ఆయన బాలినేనిని కోరారు. ఇందుకు బాలినేని ఒప్పుకోలేదు. ఎంపీ టికెట్ మాగుంటకు కాకుండా మరెవరికి ఇచ్చినా తాను సపోర్ట్ చేయనని.. ఎక్కడి నుంచి పోటీ చేసుకుంటారో చేసుకోండి.. మీకో దండం.. మీ సీఎంకో దండం అని విరుచుకుపడ్డారని టాక్